ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు చేదు అనుభవం - పాయకరావుపేట ఎమ్మెల్యే తాజా సమాచారం

విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు పంచాయతీ ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. నక్కపల్లి మండలం దేవవరం గ్రామ సర్పంచి అభ్యర్థి.. ఎంపిక విషయంలో సొంత పార్టీకి చెందిన మరో వర్గంవారు ఆయన్ను చుట్టుముట్టారు.

పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు చేదు అనుభవం
పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు చేదు అనుభవం

By

Published : Feb 8, 2021, 8:54 PM IST

పంచాయతీ ఎన్నికల ప్రచారంలో విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు చేదు అనుభవం ఎదురైంది. నక్కపల్లి మండలం దేవవరం గ్రామ సర్పంచి అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే వెళ్లారు.

ఈ క్రమంలో సొంత పార్టీకి చెందిన.. మరో వర్గంవారు ఆయన్ను అడ్డగించి.. చుట్టుముట్టారు. సర్పంచి అభ్యర్థి ఎంపిక విషయంలో బాబూరావును నిలదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. అక్కడినుంచి ఎమ్మెల్యేను అతని వాహనంలో పంపించారు.

ABOUT THE AUTHOR

...view details