ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్' - ఎంపీ విజయసాయి రెడ్డి

తెదేపా తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఆ పార్టీని భాజపాకు ధారాదత్తం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని పేర్కొన్నారు. విశాఖలో భూ దందాలపై సిట్​ వేశామన్న ఆయన... బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి

By

Published : Oct 30, 2019, 8:22 AM IST

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి

తెదేపా అధినేత చంద్రబాబుకు సొంత పుత్రుడు లోకేశ్​ అయితే దత్త పుత్రుడు పవన్​ కల్యాణ్​ అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన... విశాఖలో భూ కుంభకోణాలపై సిట్‌ వేశామని.. బాబు, పవన్ పన్నాగాలకు ఎవరూ లోను కావద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని కొనియాడారు.

20 ఏళ్లు జగనే సీఎం

వచ్చే 20 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఇళ్లు రద్దు చేస్తున్నామని తెదేపా తప్పుడు ప్రచారం చేస్తోందని.. అర్హులందరికీ ఇళ్లు, ఉగాదికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే అందరికీ ఇసుక దొరుకుతుందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు.

ఇవీ చదవండి:

కేంద్రానికి చెప్పాకే.. పోలవరం రివర్స్ టెండరింగ్: విజయసాయి

ABOUT THE AUTHOR

...view details