విశాఖ మన్యంలో మంచు అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. చలి గిలిగింతలు పెడుతున్న వేళ వెచ్చని మంటలు వేసుకుని....ఆ అనుభూతిని ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నారు. తెల్లవారుజామునే ట్రెక్కింగ్ చేసుకుంటూ మంచు సోయగాలు చూసి మైమరిచిపోతున్నారు. పాడేరు 10, చింతపల్లి పరిసరాల్లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మన్యంలో మంచు సోయగం.. పర్యాటకుల్లో ఉల్లాసం - విశాఖ మన్యం తాజా వార్తలు
విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం 10 అయితే తప్ప సూర్యుడు కనిపించడం లేదు. మంచు దుప్పటి కప్పుకున్న మన్యం మరింత అందంగా ఉండటంతో పర్యటకులు మురిసిపోతున్నారు.
vishaka agency