Veena-Vani to Home: తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన అవిభక్త కవలలు వీణ-వాణిలు తమ సొంత గ్రామానికి వచ్చారు. వీళ్లు 2002 అక్టోబర్ 16న జన్మించారు. వాళ్లు ప్రస్తుతం హైదరాబాద్లోని బాల సదనంలో ఉంటున్నారు. 19 సంవత్సరాల తరువాత పుట్టిన ఊరికి రావడంతో గ్రామ ప్రజలు వీరిని చూడ్డానికి వచ్చారు. కొంతమంది అధికారులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా వారి లక్ష్యం ఏమిటని పలువురు ప్రశ్నించగా.. డిగ్రీ పూర్తి అయ్యాక సీఏ అవుతామని చెప్పారు.
19 ఏళ్ల తర్వాత సొంతింటికి అవిభక్త కవలలు వీణ-వాణి - Vishakapatnam news
Veena-Vani to Home: అవిభక్త కవలలు వీణ-వాణిలు వారి సొంత గ్రామానికి వచ్చారు. 19 ఏళ్ల తర్వాత రావడంతో వారిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
సొంతింటికి విచ్చేసిన అవిభక్త కవలలు
"చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటికి రావడం ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నా లక్ష్యం సీఏ"- వాణి
ఇవీ చదవండి