విశాఖ జిల్లా మన్యం కేంద్రమైన పాడేరులో ఓ కుటుంబం వరలక్ష్మీ దేవి వ్రతాన్ని వినూత్నంగా నిర్వహించింది. అమ్మవారి ప్రతిమకు మాస్క్ కట్టి వ్రతం చేశారు. ప్రపంచాన్ని కరోనా నుంచి విడిపించాలని కోరుతూ.. ఈ విధంగా చేసినట్లు కొండలరావు వివరించారు. అమ్మవారి ప్రతిమకు మాస్కు కట్టడాన్ని స్థానికులు ఆసక్తిగా గమనించారు.
కరోనా వేళ...వరలక్ష్మీ దేవికీ మాస్క్! - మాస్కుతో వరలక్ష్మీ వ్రతం న్యూస్
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని వినూత్నంగా నిర్వహించారు ఆ కుటుంబ సభ్యులు. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవటానికి మనం మాస్కులు ఏ విధంగా ధరిస్తున్నామో.. అమ్మవారి ప్రతిమకు వారు అలాగే ధరింపజేసి.. పూజలు చేశారు. ఇలా ఎక్కడ నిర్వహించారో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
వరలక్ష్మి దేవికి మాస్కుతో వ్రతం