హిందూముస్లిం ఐక్యత కోసం షిరిడీ సాయిబాబా నిర్వహించినకార్యక్రమాలకు గుర్తుగా600 ఏళ్లుగానిర్వహించే హజరత్ ఆన్సర్ మదిని ఔలియ ఉరుసు ఉత్సవాన్ని శనివారం ఘనంగా జరిపారు. విశాఖ జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలుతరలివచ్చారు. మదిని సమాధిదర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాధికి చందనాన్ని పూశారు. చందనాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఇక్కడ ఉన్న బాబా సమాధి వద్ద కోరికలు చెప్పుకుంటేనెరవేరుతాయని భక్తుల నమ్మకం. వేడుకలో ఏర్పాటు చేసిననాగపూర్ వాసి అనిష్, సుల్తాన్ బేగం ఖవ్వాలి ఆకట్టుకుంది. స్థానిక శాసనసభ్యుడుపీలా గోవింద సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.