సమాజంలో ఒక సమస్య మరెన్నో సాధనాలకు మార్గమని కరోనా కాలం నిరూపించింది. మార్చి నెల మూడో వారం నుంచి దేశమంతా లాక్డౌన్ విధించారు. ఎక్కడికక్కడే అన్ని నిలిచిపోయాయి. కర్మాగారాలు మూసుకుపోయాయాయి. ఉద్యోగాలు, చిన్న చితక పనులు చేసుకునే వారికి ఉపాధి కరవైంది.
సరిగా ఈ సమయంలోనే విశాఖ జిల్లా రాంబిల్లి, పరవాడ మండలంలో వందలాది మంది యువకులు పట్టణాల్లో పనులు లేక... ఊరికి తిరిగివచ్చారు. పంటలు సాగుచేశారు. ఎప్పుడూ పండించే వరి, ఇతర వ్యవసాయ పంటలకు వచ్చే ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.