విశాఖలోని మధురవాడ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదానికి.. యువతి, యువకుడు బలయ్యారు. ఈరోజు తెల్లవారుజామున కొమ్మాది నుంచి ద్విచక్రవాహనంపై వస్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు పోతిన మల్లయపాలెం సీఐ రవికుమార్ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువతి, యువకుడు బలి - విశాఖలో రోడ్డు ప్రమాదం
ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా.. రోడ్డు ప్రమాదాలకు యువత బలవుతూనే ఉంది. తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇరువురు వ్యక్తులను ఊహించని పరిణామం పెట్టుకుంది. నిండా ఇరవై ఏళ్లు కూడా లేని.. మధు, ప్రేమకుమార్‌లు విశాఖ నగర సమీపంలోని మధురవాడలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించారు.
మధురవాడ రోడ్డు ప్రమాదం
మృతులు రాంనగర్ వాసి మధు, కొమ్మాది వైఎస్సార్ కాలనీకి చెందిన ప్రేమ కుమార్‌లుగా గుర్తించినట్లు సీఐ వెల్లడించారు. అక్కడికక్కడే ఇరువురూ మరణించారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:నిఘా వేశారు.. దొంగలను పట్టారు..