విశాఖ ఏజెన్సీ చెక్కరాయి గిరిజన గ్రామంలో రెండు రోజుల వ్యవధిలో ఆకస్మికంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంగళవారం నాగరాజు (47) ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి కిందపడి మరణించాడు. మరో వ్యక్తి బాలన్న (49) గురువారం ఒక్కసారిగా కిందపడి మృత్యు ఒడికి చేరుకున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడంతో ఈ గ్రామం విషాదంలో మునిగిపోయింది. వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ ఆదేశించారు.
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మరణం - visakhapatnam latest news
పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ చెక్కరాయిలో మంగళ, గురువారాల్లో ఇద్దరు వ్యక్తులు ఆకస్మికంగా చనిపోయారు.
విశాఖ మన్యంలో ఇద్దరు మృతి