వేగంగా వెళుతున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి తోటాడ సమీపంలో జరిగింది. మృతులు అప్పికొండ కుమారస్వామి(24), రాయవరపు ఈశ్వర రావు(18)గా గుర్తించారు. గాయపడిన త్రినాథను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పట్టణ ట్రాఫిక్ సీఐ ప్రసాద్ పరిశీలించారు.
ACCIDENT: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి - విశాఖ పట్నం
విశాఖ జిల్లా అనకాపల్లి తోటాడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.
Accident
కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ వెల్లడించారు. కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి:DANGER JOURNEY: కారు డిక్కీలో కూర్చుని ప్రయాణం..ప్రాణాలతో చెలగాటం