విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా... ప్రస్తుతం 459 అడుగులుగా ఉంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో... జలాశయం సమీపంలో ఉండే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
కళ్యాణపులోవ జలాశయం రెండు గేట్లు ఎత్తివేత - vizag latest news
ఎగువన కురుస్తున్న వర్షాలతో కళ్యాణపులోవ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కళ్యాణపులోవ జలాశయం రెండు గేట్లు ఎత్తివేత