విశాఖ మన్యం గ్రామాల్లో పనిచేస్తున్న కోదూ, కువి భాషా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని, జీవో3 చట్టబద్ధత చేయాలని గిరిజన సంఘం ఏజెన్సీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. వేకువజామునుంచే పాడేరు కాంప్లెక్స్ వద్ద నిరసనకారులు బస్సులు, ప్రైవేటు వాహనాలను అడ్డగించారు. వాటిని ముందుకు వెళ్లనీయకుండా రోడ్డుపైనే బైఠాయించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 40 మందిని వాహనాల్లో ఎక్కించి పాడేరు, హుకుంపేట స్టేషన్ లకు తరలించారు.
tribals protest at paderu: పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన.. - ap news
పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ.. నేడు మన్యం బంద్‌కు ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింది.
tribals protest at paderu