విశాఖ మన్యం అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీలో పసిని, కరకవలస గ్రామాల్లో వరుస మరణాలతో గిరిజనులు భయపడుతున్నారు. శరీరమంతా వాచిపోయి.. రెండు-మూడు రోజుల్లోనే బాధితులు చనిపోతున్నారని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 8 రోజుల వ్యవధిలో ముగ్గురు ఈ విధంగా చనిపోయారు. తమకు ఏ వ్యాధి సోకిందో తెలియటం లేదని వారు వాపోతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందతున్నారని గిరిజనులు వివరించారు.
ఎనిమిది రోజుల్లో... ముగ్గురు గిరిజనులు మృతి
వరుస మరణాలతో విశాఖ మన్యంలో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. ఎనిమిది రోజుల వ్యవధిలో ముగ్గురు గిరిజనులు మృత్యువాత పడ్డారు. అంతుచిక్కని వ్యాధితో అల్లాడుతున్న తమను ఆదుకోవాలంటూ గిరిజనులు మెుర పెట్టుకుంటున్నారు.
అంతుచిక్కని వ్యాధితో గిరిజనులు మృతి
తాగునీరు, పారిశుద్ధ్యం లేకపోవటం వంటి కారణాల వలన ఇటువంటి వ్యాధులు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతుచిక్కని వ్యాధితో సతమతమవుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలనీ.. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:పొంగుతున్న వాగులు.. నిలిచిన వాహనాలు