విశాఖ జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఎస్టీ కొండదొర వాల్మీకి కుల పత్రాల జారీలో జాప్యం వల్ల వైయస్సార్ చేయూత పథకం పొందడంలో అన్యాయం జరుగుతుందని వారు నిరసన చేశారు. తాము లబ్ధి పొందకపోవటానికి కారణం రెవెన్యూ అధికారులేనన్నారు. రాష్ట్ర గిరిజన సంఘం కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో వర్షంలోనే తడుస్తూ గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు,
నర్సీపట్నంలో గిరిజనుల ఆందోళన
వైయస్ఆర్ చేయూత పథకం పొందడంలో తమకు అన్యాయం జరుగుతుందని నర్సీపట్నంలో గిరిజనులు ఆందోళన చేశారు. తమకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయటంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, పథకాలు అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీవోకు వినతి పత్రం అందజేశారు.
నర్సీపట్నంలో గిరిజనులు ఆందోళన
రావికమతం మండలం సజ్జాపురం, గుడ్డిగా చీమలపాడు, కొమిర తదితర గ్రామాల గిరిజనులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు, గిరిజనులకు ధ్రువ పత్రాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజనులకు రావలసిన రాయితీలు, ప్రభుత్వ పథకాలు తమకు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.
ఇవీ చదవండి
విద్యుదాఘాతంతో వాలంటీర్ మృతి
TAGGED:
narsipatnam news