రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలతో... ప్రమాదాలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. విశాఖ వంటి నగరాల్లో మరీ ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రహదారి ప్రమాదాల బారినపడ్డ కుటుంబాల పరిస్థితి చూసి చలించిన... వర్ణిక హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు... ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతాయి... నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో... తెలిపే ప్లకార్డులు ప్రదర్శించారు.
విశాఖలో విద్యార్థుల వినూత్న కార్యక్రమం... ఎందుకో తెలుసా..? - Students traffic rules rally news in Visakha
పుస్తకాలు చేత పట్టుకుని కళాశాలలకు వెళ్లాల్సిన ఆ కుర్రాళ్లు... ప్రజాసేవలో మేము సైతం అంటూ... ముందుకొచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి కుటుంబాలను చూసి చలించిన ఆ విద్యార్థులు... తమ వంతు సహాయం చేయాలనుకున్నారు. చేతిలో పుస్తకాలకు బదులు... ప్లకార్డులు పట్టుకున్నారు. వాహనచోదకులారా... మీ కోసం మీ కుటుంబం ఎదురుచూస్తోందంటూ... అవగాహన కల్పిస్తున్నారు విశాఖ వర్ణిక హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు.
Traffic Rules Awareness rally in Visakhapatnam
సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి, హెల్మెంట్, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడపొద్దని చోదకులకు అవగాహణ కల్పించారు. పువ్వులు చాక్లెట్లు అందించారు. జాగ్రత్తగా నడపకపోతే జరిగే ప్రమాదాల వల్ల... అనేక కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తోందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ... ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: గుంటూరులో ట్రాఫిక్ సమస్యకు పోలీసుల చర్యలు