విశాఖ ఏజెన్సీలో 2 వారాల కిందట తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఓ మహిళా ఆవేదన చెందుతున్నారు. తప్పు చేసి ఉంటే కోర్టు ముందు హాజరు పర్చాలని కోరుతూ చేస్తూ ఆమె కుటుంబసభ్యులతో కలిసి పాడేరు సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పెదబయలు మండలం మారుమూల ఇంజరిలో తౌడుబాబు అనే వ్యక్తిని ఈ నెల 7న పోలీసులు అదుపులో తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 2వారాలు దాటుతున్నా విడిచి పెట్టలేదని ఎక్కడున్నాడో కూడా ఆచూకి తెలియదని వాపోతున్నారు. గతంలో మావోయిస్టుల కార్యకలాపాలలో ఉన్నట్లు పోలీసులు, ఇన్ ఫార్మర్‌గా పోలీసులకు సహకరిస్తున్నారని మావోయిస్టులు.. నెపం వేయడంతో భయాందోళలతో 15 ఏళ్లుగా గ్రామంలో ఉండి పోయినట్లు భార్య ఆరోపిస్తోంది.
తప్పు చేసి ఉంటే కోర్టు ముందు హాజరు పర్చాలని ... కానీ.. - woman complained to the sub-collector
తన భర్తను అదుపులోకి తీసుకుని... 2 వారాలైనా విడిచి పెట్టలేదని ఓ మహిళ.. సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తప్పు చేసి ఉంటే కోర్టు ముందు హాజరు పర్చాలని కోరారు. కనీసం ఆచూకీ కూడా తెలపటం లేదని వాపోాయారు.
మహిళ ఫిర్యాదు