ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగర తీరంలో... సరికొత్త ప్రపంచం! - world

భానుడి భగభగలు ఓ వైపు... భరించలేని ఉక్కపోత మరోవైపు... ఇటువంటి తరుణంలో హిమ బిందువులు శరీరాన్ని తాకుతుంటే.. ఆహా...! ఊహే ఇలా ఉంటే.. ఇదంతా నిజమైతే..!? ఈ సరికొత్త ప్రపంచం సాగరతీరంలో ఆవిష్కృతమైంది. విశాఖ వాసులకు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న... ఆ స్నో వరల్డ్ సంగతులేంటో చదివేద్దామా...

సాగర తీరంలో... సరికొత్త ప్రపంచం!

By

Published : Jun 3, 2019, 8:03 AM IST

సాగర తీరంలో... సరికొత్త ప్రపంచం!

ఓ పక్క సముద్ర తీరం... మరోపక్క హిమ ప్రపంచం... ఇంతకంటే ఆహ్లాదం ఇంకేముంటుంది. వేసవిలో దీనిని మించిన ప్రదేశం మరెక్కడుంటుంది. విశాఖ నగరంలో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్​లో ఈ ప్రపంచం కొలువుదీరింది. అందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన "స్నో వరల్డ్" సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మిరుమిట్లు గొలిపే కాంతులతో...
మండుటెండలో మంచు కురవటమే ఓ వింత. ఎంతోమందికి ఇదో ఊహే కానీ... సాధ్యం కాదు. దేశంలోని ఊటీ, కొడైకెనాల్, కుఫ్రి, మనాలి... ఇలా ఎక్కడికెళ్లినా మంచు కురవటం సాధారణమే! కానీ మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య హిమపాతం... అదీ మండు వేసవిలో అంటే ఓ పగటి కలే..!? అందుకే ఇంకెక్కడా దొరకని అనుభూతిని విశాఖ వాసుల దరిచేర్చాలని భావించారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. మండు వేసవిలో పండు మంచును కురిపిస్తూ... సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు.

అదిరేటి స్టెప్పు మీరేస్తే...
స్నో వరల్డ్​లో మరో అనుభూతి మిమ్మల్ని పరవశింప చేస్తుంది. మంచు కురిసే వేళలో అదిరేటి స్టెప్పులేసే అవకాశం మీకు ఈ ప్రపంచంలో దొరుకుతుంది. స్నో వరల్డ్​లోకి ప్రవేశించగానే... వినసొంపైన సంగీతం మిమ్మల్ని కట్టి పడేస్తుంది. అనుకోకుండానే మీ మనసు అలా.. అలా.. హమ్ చేస్తూనే ఉంటుంది. మీ ప్రమేయం లేకుండానే పాదం స్టెప్పులేసేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిస్కో... మిమ్నల్ని కట్టి పడేస్తుంది.

మనసును చల్లపరిచే హిమం మనసుని తాకుతుంటే... మిరుమిట్లు గొలిపే కాంతిలో ఫాస్ట్ బీట్ సాంగ్ హుషారెత్తిస్తుంటే... ఇంతకుమించిన ప్రపంచం ఇంకెక్కడుంటుంది. ఇంకెందుకు మరి ఆలస్యం... ఆ సరికొత్త ప్రపంచాన్ని మనమూ చూసొద్దామా...

ఇదీ చదవండీ:"గిరిపుత్రికా కౌషల్ వికాస్"... మన్యంలో ఏం చేస్తుందంటే!?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details