Purna market : ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో పూర్ణామార్కెట్ను అనుయాయులకు అప్పగించే ప్రతిపాదనలు తక్షణమే విరమించుకోవాలని వర్తకులు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 1న జరిగే జీవీఎంసీ కౌన్సిల్‌లో వైఎస్సార్సీపీ పాలకవర్గ నిర్ణయాలను అన్ని రాజకీయపార్టీల కార్పొరేటర్లు ముక్తకంఠంతో వ్యతిరేకించి ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడాలని కోరుతున్నారు.
పీపీపీ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి :విశాఖ నగరానికి కీలకమైనది పూర్ణామార్కెట్. దీనినే సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ అని అంటారు. హోల్‌సేల్‌తోపాటు ప్రజలకు చౌకగా సరుకులు లభించే మార్కెట్. జీవీఎంసీ లెక్కల ప్రకారమే సుమారు 430 శాశ్వత, 200 తాత్కాలిక దుకాణాలు, లోపల, బయట మరో 100మంది చిరువ్యాపారులు కలిపి సుమారు 650మంది ఉన్నారు. 1.35 ఎకరాల విస్తీర్ణంలో ఈ మార్కెట్ ఉంది. పీపీపీ మోడల్‌లో దీనిని అభివృద్ధి చేస్తామని ప్రతిపాదనలు చేశారు. కాగా, వందల మందికి ఉపాధి పోతుందని అగ్రహిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు లాభం పొందుతారని.. చిరువ్యాపారులు, ప్రజల మీద భారం పెరుగుతుందని... పీపీపీ ప్రతిపాదనను విరమించాలని పోరాటం చేస్తామంటున్నారు వర్తకులు. పూర్ణ మార్కెట్ 1935 నుంచి ఉందని, అటువంటి పురాతన నిర్మాణం కాపాడాలని కోరుతున్నారు.
మా పోరాటం కొనసాగిస్తాం