ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశంలో తయారైన తొలి రేడియోథెరపీ యంత్రం విశాఖలో ఏర్పాటు - lions cancer hospital updates

భారతదేశంలో తయారైన మొట్టమొదటి రేడియోథెరపీ యంత్రం విశాఖకు రానుంది. 120 మంది శాస్త్రవేత్తలు ఐదేళ్లుగా శ్రమించి ఈ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేడియోథెరపీ యంత్రాల కంటే అధునాతన సౌకర్యాలతో, రోగులకు అత్యంత ఉపయుక్తంగా ఉండేలా దీనిని తీర్చిదిద్దారు.

radiotherapy machine
radiotherapy machine

By

Published : Jan 5, 2021, 5:46 AM IST

విశాఖ లయన్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి అత్యాధునిక భారత్‌ తయారీ రేడియోథెరపీ యంత్రం రానుంది. రూ.12కోట్ల విలువైన ఆ పరికరాన్ని బెంగళూరుకు చెందిన పనాసియా అనే సంస్థ రాయితీకి విశాఖ లయన్స్‌ ఆసుపత్రికి ఇవ్వాలని నిర్ణయించింది. భారతదేశంలో తయారైన మొట్టమొదటి అత్యాధునిక రేడియోథెరపీ యంత్రం అదే కానుండడం గమనార్హం.

120 మంది శాస్త్రవేత్తలు-ఐదేళ్లు :

బాబా అణు పరిశోధన కేంద్రం(బార్క్‌), బెంగళూరుకు చెందిన పనాసియా మెడికల్‌ టెక్నాలజీస్‌ సంస్థ, కేంద్ర ఐ.టి. మంత్రిత్వశాఖ పరిధిలోని సమీర్‌ సంస్థ శాస్త్రవేత్తలు కలిసి సంయుక్తంగా భారత్‌లోనే అభివృద్ధి చేసిన అత్యాధునిక మొట్టమొదటి రేడియోథెరపీ యంత్రాన్ని విశాఖలో అందుబాటులోకి తీసుకరాన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేడియోథెరపీ యంత్రాల కంటే అధునాతన సౌకర్యాలతో, రోగులకు అత్యంత ఉపయుక్తంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు. 'స్టీరియో టాక్టిక్‌ రేడియో థెరపీ' పరిజ్ఞానాన్ని జోడించారు. పనాసియా సంస్థ కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలకు చెందిన 120 మంది శాస్త్రవేత్తలు ఐదేళ్లుగా శ్రమించి 'సిద్ధార్థ్‌-2' పేరుతో దీన్ని తయారు చేశారు. పనాసియా సంస్థ ఎండీ జీ.వీ.సుబ్రహ్మణ్యం విశాఖ వాసి కావటంతో ఇక్కడి లయన్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి రాయితీపై ఇస్తున్నారు. ఆసుపత్రి మేనేజింగ్‌ ట్రస్టీ ఆచార్య వి.ఉమామహేశ్వరరావుతో పనాసియా ఎండీ జి.వి.సుబ్రహ్మణ్యం సోమవారం చర్చించారు. మరో నెలరోజుల్లో ఈ యంత్రాన్ని మార్కెట్లోకి తేనున్నట్లు ఆయన ఈటీవీ భారత్​కు తెలిపారు.

ఇదీ చదవండి :

'రోలుగుంటలో నిరుపయోగంగా భవనాలు'

ABOUT THE AUTHOR

...view details