ఆంధ్రవిశ్వవిద్యాలయ 'కామర్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్' విభాగం విశ్రాంత ఆచార్యుడు వి.కృష్ణమోహన్‌ను రిజిస్ట్రార్‌గా పునర్నియమిస్తూ... రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏడాది పాటు ఆయన విశ్వవిద్యాలయంలో విధులు నిర్వర్తించనున్నారు.
ఆయన పునర్నియామకం విశ్వవిద్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. అతితక్కువ మందికి మాత్రమే లభించే అవకాశం ఆచార్య కృష్ణమోహన్‌కు మరోసారి లభించడం గమనార్హం. రిజిస్ట్రార్‌గా ఉండి ఉద్యోగ విరమణ చేసిన ఆయనకే మళ్లీ రిజిస్ట్రార్ పదవి కూడా వరించనుంది.