విశాఖ జిల్లా పాడేరు మన్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలిగాలులు విజృంభించడంతో ఏజెన్సీ ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అది చాలదన్నట్లు మన్యం ప్రాంతమంతా పొగమంచుతో నిండిపోయి.. ఏమీ కనిపించట్లేదు. దట్టమైన పొగమంచుతో వాహన చోదకుల ఇబ్బందులు పడుతున్నారు. పాడేరులో 11, మినుములూరులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎముకలు కొరికే చలి నుంచి ఉన్ని దుస్తులు, రగ్గులు కూడా వారిని రక్షించలేకపోతున్నాయి.
Temperatures Fall At Visakhapatnam: మన్యంలో చలి పంజా..ప్రజలు గజగజ - ap news
విశాఖ మన్యంలోని ప్రజలను చలి చంపేస్తోంది. మంటలు వేసుకున్నా చలికి గజగజా వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా ఆ ప్రాంతమంతా చిమ్మ చీకట్లు అలముకున్నాయి.
temperatures at vijayawada