ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రపంచ రికార్డు సృష్టించిన తెలుగు విద్యార్థి - world record

రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టికను 1.05 సెకన్లలో వేసి విశాఖ జిల్లా చోడవరానికి చెందిన తేజ అనే విద్యార్థి ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఉత్తరప్రదేశ్​కు చెందిన విద్యార్థి పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు.

రికార్డు సృష్టించిన తెలుగు విద్యార్థి

By

Published : Aug 17, 2019, 7:05 PM IST

రికార్డు సృష్టించిన తెలుగు విద్యార్థి

విశాఖ జిల్లా చోడవరంలోని ఏడమ్స్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. పట్టణానికి చెందిన కేత తేజ అనే విద్యార్థి రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టికను 1.05 సెకన్లలో వేసి రికార్డు సృష్టించాడు. అతి తక్కువ సమయంలో ఆవర్తన పట్టికను వేయడంతో తేజ ప్రపంచ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు ప్రపంచ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ రాష్ట్ర సమన్వయకర్త రంగారావు ప్రపంచ రికార్డు ధ్రువపత్రం, బంగారు పతకాన్ని అందజేశారు. గతంలో ఈ రికార్డు ఉత్తరప్రదేశ్​కు చెందిన తరుణ్ అగర్వాల్ అనే విద్యార్థి పేరిట ఉంది. అతను 1.29 సెకన్లలో వేయగా..తాజాగా తేజ ఆ రికార్డును బద్దలుకొట్టాడు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని తేజ, అతని తల్లిదండ్రులను అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details