విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచించాలన్నారు. కేంద్ర వైఖరి అంబానీ, అదానీలకు కొమ్ముకాసేలా ఉందన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. ప్రజలు అమరావతినే ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారన్నారు. 14 వ తేదీన అమరావతిలో విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
'కేటీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం' - vishakha steel plant latest news
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. ప్రధాని మోదీ.. అంబానీ, అదానీలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.
'కేటీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం'