TDP Senior leaders fire on CM Jagan: 'గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు' పేరుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను, యువతను మభ్య పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని.. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, బోండా ఉమాలు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఆనాడూ రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తీసుకొస్తే.. అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఆ పరిశ్రమలన్నింటినీ రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నర ఏళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తేలేని సీఎం.. ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తారో చూడాలని ఎద్దేవా చేశారు.
విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, బోండా ఉమా ఆధ్వర్యంలో ఈరోజు మీడిాయా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా 'రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా, ఆ జిల్లా.. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడా లేకుండా జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమల లిస్ట్'ను విడుదల చేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ..గత మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు 'గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు' పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తీసుకొస్తే.. అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు ఆ పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిందని విమర్శించారు. గత మూడున్నర ఏళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేని ముఖ్యమంత్రి.. ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తారో చూడాలని ఎద్దేవా చేశారు.