ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్ల స్థలాల కేటాయింపులో.. వైకాపా అక్రమాలకు పాల్పడుతుంది' - విశాఖ జిల్లా వార్తలు

రైతుల దగ్గర భూములు బలవంతంగా లాక్కొని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించడం న్యాయం కాదని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. విశాఖ జిల్లా జి.కొత్తపల్లి వద్ద ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో వైకాపా అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు.

tdp
tdp

By

Published : Nov 7, 2020, 6:55 PM IST

ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుందని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆరోపించారు. రైతులకు న్యాయం చేసి, అర్హులైన పేదలకు ప్రభుత్వమే భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా చీడికాడ మండలం జి.కొత్తపల్లి వద్ద ప్రభుత్వం గుర్తించిన ఇళ్ల స్థలాల ప్రాంతాన్ని రామానాయుడు పరిశీలించారు.

రైతులు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులు, పేదలకు న్యాయం చేయాలని తెదేపా నేతలు ధర్నా నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో వైకాపా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని రామానాయుడు ఆరోపించారు.

ఇదీ చదవండి :'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'

ABOUT THE AUTHOR

...view details