ప్రభుత్వం విశాఖలో అక్రమంగా భూసేకరణ చేపడుతుందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణ అన్నారు. విశాఖలోని ప్రజలు ల్యాండ్ పూలింగ్పై ఆందోళనకు గురవుతున్నారన్నారు. సోమవారం విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ల్యాండ్ పూలింగ్పై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మొత్తం 10 వేల ఎకరాలు సేకరిస్తున్నారని.. ఈ భూములను బిల్డ్ ఏపీ పేరిట అమ్మకానికి పెడితే తిరగబడతామని సత్యనారాయణ హెచ్చరించారు. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి... జగన్మోహన్ రెడ్డి హిందువా, క్రైస్తవుడో చెప్పాలని డిమాండ్ చేశారు.
విశాఖ భూములు అమ్మితే ఊరుకోం: తెదేపా నేత బండారు సత్యనారాయణ - విశాఖ భూములు అమ్మితే ఊరుకోం: తెదేపా నేత బండారు సత్యనారాయణ
ముఖ్యమంత్రి జగన్ హిందువా లేదా క్రైస్తవుడా అనేది విశాఖ శారదా పీఠం పీఠాధిపతి చెప్పాలని తెదేపా నేత బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. తమ భూములను అమ్మకానికి పెడితే తిరగబడతామని బండారు హెచ్చరించారు. విశాఖలో ప్రజలు ల్యాండ్ పూలింగ్పై ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.
తెదేపానేత బండారు సత్యనారాయణ
TAGGED:
తెదేపా నేత బండారు సత్యనారాయణ