మున్సిపల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. నర్సీపట్నం పురపాలక ఎన్నికల సందర్భంగా.. అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించిన అనంతరం అయ్యన్నపాత్రుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈనెల ఎనిమిదో తేదీన నిర్వహించే ద్విచక్ర వాహన ర్యాలీకి జనసమీకరణ చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులను ఆదేశించడం ఫోన్ ద్వారా బహిర్గతం అయిందని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి సంబంధిత అధికారులపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్‌ను బర్తరఫ్ చేయాలి: అయ్యన్నపాత్రుడు - నర్సీపట్నంలో ఎన్నికలు
విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ద్విచక్రవాహన ర్యాలీకి జనసమీకరణ చేయాలని పెట్ల ఉమాశంకర్ గణేశ్.. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులను ఆదేశించారని ఆరోపించారు.
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు