మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా.. విశాఖ జిల్లా పాయకరావుపేటలో తెదేపా శ్రేణులు నిరసనలు చేపట్టాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ దారుణమని విమర్శిస్తూ.. అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
'అచ్చెన్నాయుడి అరెస్ట్ దారుణం' - పాయకరావుపేటలో తెదేపా నిరసన వార్తలు
అచ్చెన్నాయుడి అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అరెస్ట్ దారుణమని.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జిల్లా పాయకరావుపేటలో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా తెదేపా ఆందోళన