Tanikella Bharani: లఘు చిత్రాలు రూపొందించేందుకు యువతకు సాహిత్యంపై లోతైన అవగాహన ఉండాలని ప్రముఖ సినీ రచయిత తనికెళ్ల భరణి అన్నారు. వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ భవన్ సమావేశ మందిరంలో ఆయనను సత్కరించారు. లఘు చిత్ర నిర్మాణం కోసం కెమెరా పనితీరుపై లోతైన అవగాహన ఉండాలని అన్నారు. ప్రముఖులు రూపొందించిన చిత్రాలను నిరంతరం పరిశీలించి అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. లఘు చిత్రాలలో సంభాషణలు రాయటానికి సాహిత్య అవగాహన అవసరమన్నారు.
లఘు చిత్రాల నిర్మాణంలో సాహిత్యం, కెమెరా నే కీలకం: తనికెళ్ల భరణి - సినీ రచయిత తనికెళ్ల భరణి
లఘు చిత్రాల నిర్మాణంలో యువతకు సాహిత్యం పైన అవగాహన అవసరమని ప్రముఖ సినీ రచయిత తనికెళ్ల భరణి అన్నారు. లఘు చిత్రాల నిర్మాణం కోసం కెమెరా పనితీరుపై అవగాహన ఉండాలని అన్నారు.
తనికెళ్ల భరణి