అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వాతి నక్షత్ర నరసింహ హోమం - temple
సింహాచలంలో అత్యంత వైభవంగా స్వాతి నక్షత్ర నరసింహ హోమం నిర్వహించారు. నెలలో ఒక్క రోజు మాత్రమే ఈ హోమం జరిపించడంతో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 2500 రూపాయలు చెల్లించిన తర్వాత హోమంలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తున్నారు.
simhachalam
సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామివారి ఆర్జిత సేవల్లో భాగంగా స్వాతి నక్షత్ర నరసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది.స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి హోమం నిర్వహించారు.ఈ హోమం నెలలో ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తారు.భక్తులు2వేల5వందల రూపాయలు చెల్లించి హోమంలో పాల్గొనవలసి ఉంటుంది..ఈ ఆర్జిత సేవకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.