ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఒడిశా రాజ్​భవన్​కు స్వాత్మానందేంద్ర సరస్వతి

ఒడిశా గవర్నర్ గణేశిలాల్ ఆహ్వానం మేరకు విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి.. భువనేశ్వర్​లోని రాజ్​భవన్​కు వెళ్లారు. ఆయనకు గవర్నర్ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

By

Published : Nov 1, 2020, 6:09 PM IST

Published : Nov 1, 2020, 6:09 PM IST

Swami Swatmananda Saraswati
Swami Swatmananda Saraswati

ఒడిశా యాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ.. ఆ రాష్ట్ర గవర్నర్ గణేశిలాల్​ను ఆదివారం కలిశారు. గవర్నర్ ఆహ్వానం మేరకు భువనేశ్వర్ లోని రాజ్ భవన్​కు వెళ్లారు. స్వామికి గవర్నర్ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామీజీ ఒడిశా యాత్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

విశాఖ శారదా పీఠంతో తనకున్న అనుబంధాన్ని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను గవర్నర్ కు వివరించారు. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ ఆశీస్సులు అందుకోవడానికి విశాఖ రావాల్సిందిగా గవర్నర్ ను ఆహ్వానించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details