ఉక్కు నగరంలో ఉక్కపోత... తగ్గేది లేదంటున్న ఉష్ణోగ్రత
ఉక్కు నగరమైన విశాఖలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎండకు వడగాల్పులు తోడై విశాఖ వాసులకు హడలు పుట్టిస్తున్నాడు.
ఫొని పెను తుపాను ముప్పు తప్పినా.. అది తరలించుకుపోయిన తేమ ఫలితంగా తీవ్ర వడగాలులు విశాఖను హోరెత్తిస్తున్నాయి. జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో అనూహ్యంగా వేడి పెరిగిపోయింది. నగరవాసులంతా రోడ్లపైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున సొంతూళ్లకు వెళ్లేవారంతా రోడ్డు ప్రయాణాలు చేయడానికి జంకుతున్నారు. ఇప్పటికే చాలాచోట్ల సాధారణ సగటుతో పోలిస్తే 4 నుంచి ఏడెనిమిది డిగ్రీల వరకూ అదనంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.., ఈ ప్రభావం ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంపై ఉంటుందని వాతావరణశాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వేడికి భయపడి ఉదయం 10 లోపే పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు ప్రజలు.