ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆదేశాలు విస్మరిస్తే.. చర్యలు తీసుకుంటాం'

కొవిడ్ మహమ్మారిని ఆసరాగా తీసుకొని విశాఖ జిల్లా నర్సీపట్నంలోని కొంతమంది ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేయటంపై సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి నియంత్రణ కోసం మోటార్ వాహనాల తనిఖీ అధికారులతో చర్చించి ధరలను నిర్దేశించారు.

sub collector
సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య

By

Published : May 21, 2021, 9:56 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా మహమ్మారిని ఆసరాగా చేసుకొని.. కొంతమంది ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిని నివారించేందుకు సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మోటార్ వాహనాల తనిఖీ అధికారితో చర్చించి ధరలను నిర్దేశించారు. నర్సీపట్నం నుంచి విశాఖపట్నానికి ఆక్సిజన్ సదుపాయంతో కలిపి అంబులెన్సు రూ.8 వేల చొప్పున , అదే పెద్ద ఆంబులెన్స్ అయితే పది వేల రూపాయల చొప్పున నిర్ణయించారు. ఆక్సిజన్ సదుపాయాలు లేకుండా చిన్న ఆంబులెన్స్ రూ.4000, పెద్ద ఆంబులెన్స్ రూ.5,000 చొప్పున ధరలను నిర్ణయించారు. ఈ ఆదేశాలను అంబులెన్స్ నిర్వాహకులు విస్మరిస్తే తగు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details