విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండరాముని విగ్రహ ధ్వంసం ఘటనను విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండించారు. విగ్రహం ధ్వంసం దురదృష్టకరమన్న స్వరూపానందేంద్ర స్వామి... దేవాదాయ శాఖ మంత్రి ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోవడం విచారకరమని అన్నారు. ఈ ఘటనకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీని గురించి ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడుతానన్న ఆయన... విశాఖ శ్రీ శారదాపీఠంలో ప్రాయశ్చిత్త హోమం చేపడతామని అన్నారు. దేవాదాయ శాఖ అప్రమత్తతతో వ్యవహరించి, ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
'ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి'
రామతీర్థం కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటనపై విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి