ఫారం7 విచారణ చేపట్టాలని ఆర్డీవోకు వినతి పత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ విశాఖ జిల్లా అనకాపల్లిలో తమ కార్యకర్తల ఓట్లను తొలగించారంటూ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ... ఆర్డీవో కార్యాలయంలో ధర్నా చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో సూర్యకళకు వినతి పత్రం అందజేశారు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. దరఖాస్తులో ఉన్న వారినుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా.. కొందరు తమ పేరుతో దాఖలైన ఓట్ల తొలగింపు దరఖాస్తులతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు.. పోలింగ్ కేంద్ర అధికారులు ఇంటింటా తిరిగి పూర్తి వివరాలు నిర్థారించుకోవాలని ఆదేశించామని ఆర్డీవో చెప్పారు. ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపునకు ఎలాంటి దరఖాస్తు చేయలేదని చెప్పిన వాళ్ల నుంచి..
సంతకాన్ని తీసుకోవాలనినిర్ణయించామన్నారు.