విశాఖలో దక్షిణ భారత కరాటే పోటీలు ప్రారంభం - vizag
దక్షిణ భారత వొడోకాయ్ కరాటే పోటీలు విశాఖలో ప్రారంభమయ్యాయి. తెదేపా ఎమ్మెల్యే గణబాబు పోటీలు ప్రారంభించారు.
కరాటే పోటీలు
విశాఖలో 4వ దక్షిణ భారత వొడోకాయ్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వేదికగా ఏర్పాటు చేసిన ఈ ఛాంపియన్ షిప్‌ను.. తెదేపా ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. విశాఖ క్రీడల హబ్‌గా పేరొందిన నగరమని.. ఇక్కడ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడలు జరగాలని ఆకాంక్షించారు. ఈ ఛాంపియన్ షిప్‌కు దక్షిణాది రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వారి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.