విశాఖ బీచ్ రోడ్లో.. 'స్మైల్ టార్చ్' - స్మైల్ టార్చ్
'స్మైల్ టార్చ్' పేరిట గ్రహణంమొర్రి శస్త్రచికిత్సలపై అవగాహన నడక నిర్వహించారు. కార్యక్రమాన్ని వీఎమ్ఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రారంభించారు.
smile-tarch-walk-in-vishaka-beach-road
గ్రహణంమొర్రి శస్త్రచికిత్సలపై చైతన్యం కల్పిస్తూ... విశాఖ బీచ్ రోడ్లో అవగాహన నడక నిర్వహించారు. 'స్మైల్ టార్చ్' పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని... వీఎమ్ఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఆంధ్రవైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ ప్రారంభించారు. పుట్టుకతోనే గ్రహణంమొర్రి బారిన పడిన పిల్లలకు... ఏడాదిలోపే శస్త్రచికిత్స ద్వారా వ్యాధి నయమవుతుందని నిపుణులు చెప్పారు. విజయవంతంగా చికిత్స పూర్తి చేసుకున్న చిన్నారులతో అతిథులు ముచ్చటించారు.