విశాఖలోని ప్రసిద్ధ రామలింగేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొని.. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పాలు, పంచామృతం ఇతర ద్రవ్యాలతో పరమేశ్వరుని అభిషేకిస్తున్నారు. మాఘమాసం త్రయోదశి రోజు వచ్చే ఈ శివరాత్రి.. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని అర్చకులు తెలిపారు. ఈరోజు శివార్చన చేస్తే సకల అభీష్టాలు తీరి సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. అభిషేక ప్రియుడు.. శివుడికి ఈ పర్వదినాన నీళ్లు, పాలు... వంటి ద్రవ్యాలతోనైనా అభిషేకిస్తే సర్వత్రా మంచి జరుగుతుందని తెలిపారు.
విశాఖ రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా శివరాత్రి వేడుకలు
విశాఖలోని రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు స్వామిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు.
విశాఖ రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా శివరాత్రి వేడుకలు