ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్న ఆదాయం... రూ.కోటి 56 లక్షలు

సింహాద్రి అప్పన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమక్షంలో లెక్కింపు ప్రక్రియ జరిగింది. అనంతరం స్వామి హుండీ ఆదాయాన్ని రూ. కోటి 56 లక్షలుగా తేల్చారు. నగదుతో పాటు బంగారం, వెండి, ఇతర దేశాల కరెన్సీని భక్తులు స్వామి వారికి సమర్పించినట్లు దేవస్థానం నిర్వాహకులు చెప్పారు.

By

Published : May 15, 2019, 11:26 PM IST

సింహాద్రి అప్పన ఆదాయం...కోటీ 56 లక్షలు

సింహాద్రి అప్పన ఆదాయం...కోటీ 56 లక్షలు

విశాఖ జిల్లా సింహాచలంలో కొలువైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి హుండీ ఆదాయం లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకలను... బేడా మండపంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమక్షంలో పలు స్వచ్ఛంద సంస్థల వారి సాయంతో లెక్కగట్టారు. గడచిన 16 రోజుల్లో స్వామి హుండీ ఆదాయం ఒక కోటి 56 లక్షల 80 వేల 50 రూపాయల నగదు, 327 గ్రాముల బంగారం, 14 కేజీల వెండి, వివిధ దేశాల కరెన్సీ లభించాయని తెలిపారు. ఈసారి స్వామి వారి ఉత్సవాలకు సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరయ్యారని ఆలయ అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకోవడం వలన ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details