ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరచిన వ్యాపారులు - విశాఖలో దుకాణాలు తెరచిన వ్యాపారులు

లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ విశాఖలో పలువురు వ్యాపారులు దుకాణాలు తెరిచారు. ఇదేంటని ప్రశ్నిస్తే... మద్యం షాపులు తెరిస్తే లేని తప్పు తమకేంటని వాదించారు. దీంతో పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు.

shops open in vishaka
shops open in vishaka

By

Published : May 6, 2020, 4:19 PM IST

విశాఖ జిల్లా భీమిలి మండలం తగరపువలసలో లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులు షాపులు తెరిచారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు అనుమతులు ఇస్తూ మందుబాబులను విచ్చలవిడిగా ప్రభుత్వం వదిలేసిందన్నారు. ప్రజలకు అవసరమైన ఎలక్ట్రికల్, గృహోపకరణాల షాపులకు మాత్రం నిబంధనలు విధించడం సమంజసం కాదని వ్యాపారులు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ ఉదయం తగరపువలసలోని అన్ని షాపులను తెరవడంతో ప్రజలు వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details