విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో అఖిలపక్ష కార్మికసంఘాలు చేపట్టిన బంద్‌లో ఎంపీ విజయసాయిరెడ్డికి భంగపాటు కలిగింది. బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి కారు దిగి ఆందోళనకారుల వద్దకు వెళ్లారు. ‘ఇదేం బంద్ చేయడం, రోడ్లపై కార్లన్నీ వెళ్లిపోతున్నాయి’ అనడంతో.. సీఐటీయూ (సిటూ) నాయకుడు ఆర్కేఎస్వీ కుమార్ కలగజేసుకుని... ‘మేం ఉదయం నుంచి బంద్ చేస్తున్నాం. మీరు, మీ పార్టీవారు ఇప్పుడే వచ్చారు’ అనడంతో వైకాపా నేతలు ఆయనకు సర్దిచెప్పారు.
తర్వాత విజయసాయిరెడ్డి మైకు చేతపట్టుకుని కార్మికులు, నాయకులకు సూచనలు చేస్తూ మానవహారం ఏర్పాటు చేయించారు. పోస్కోతో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని రద్దు చేయించాలని ఈ సందర్భంగా సిటూ కార్యకర్త సురేష్ అనగా.. విజయసాయిరెడ్డి సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్లిపోయారు.