విశాఖపట్నం జిల్లాలోని శారదా నదిపై నిర్మించిన కాజ్వేలు వరద ఉద్ధృతికి ధ్వంసమయ్యాయి. గవరవరం, దేవరాపల్లి పరిధిలోని గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్న కారణంగా... శారదా నది ఉద్ధృత రూపు దాల్చింది. ప్రవాహం తగ్గాలంటూ... స్థానిక మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
కొట్టుకుపోయిన కాజ్వే.. నిలిచిన రాకపోకలు - విశాఖపట్నం జిల్లా వాతావరణం వార్తలు
విశాఖపట్నం జిల్లాలోని శారదా నదిపై నిర్మించిన కాజ్వే.. భారీగా కురుస్తున్న వర్షాలకు కొట్టుకుపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వరద ఉద్ధృతి తగ్గాలంటూ మహిళల పూజలు