జీవీఎంసీ పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులతో చర్చించారు. వేసవి తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, అల్లర్లు సృష్టించేందుకే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు ఎన్నికలు వాయిదా పడేలా చేశారని ఆరోపించారు. లేఖ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన దోషులను శిక్షించాలని అన్నారు.
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికే కేంద్రానికి ఎస్ఈసీ లేఖ: అవంతి - corona
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు ఎన్నికలు వాయిదా వేసేలా చేశారని అన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై జీవీఎంసీ అధికారులతో చర్చించారు.
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికే కేంద్రానికి ఎస్ఈసీ లేఖ