చీర కట్టు తెచ్చే వన్నెలు అనంతం. సాంప్రదాయంతో పాటు, మగువ అందాన్ని పెంచే చీర కట్టు అంటే నచ్చని భారతీయుడు ఉండడంటే అతీశయోక్తి కాదు. అలాంటి రంగు రంగుల చీరలు పంటకు రక్షణగా మారి చూపరులను ఆకట్టుకుంటోంది.
విశాఖ జిల్లా కె సంతపాలెం రైతులు మొక్కజొన్న పంట చుట్టూ రక్షణగా చీరలు కట్టారు. పశువులు ఇతర జంతువులు పాడు చేయకుండా కట్టినట్లు అన్నదాతలు చెప్పారు. పచ్చని మొక్కజొన్న పంట చుట్టూ చక్కగా కట్టిన చీరలు రకరకాల రంగుల్లో హరివిల్లును తలపిస్తున్నాయి.