విశాఖనగరంలోని ఆశీల్ మెట్ట సమీపంలో సంపత్ వినాయకుడిని 1950వ దశాబ్దంలోనే సంబంధన్ అండ్ కంపెనీ తమ కార్యాలయం ఎదురుగా ప్రతిష్టించుకుంది. అప్పట్లోనే తమిళనాట నుంచి అర్చకస్వామిని తీసుకువచ్చి నిత్యం పూజలు ఆరంభించింది. తెల్లవారుజామున ప్రతి రోజూ గణపతి హోమం, హవనం, మూలవిరాట్టుకు అభిషేకం చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ జరిగే ఆర్చనల కోసం భక్తులు కొన్ని నెలలు తరబడి తమ వంతు వచ్చే వరకు వేచి ఉంటారు. తమిళ, తెలుగు సంప్రదాయాలు ఇక్కడ కన్పిస్తాయి.
- మనోభీష్టాలను నెరవేర్చే స్వామి..
ప్రత్యేకించి గణపతి నవరాత్రులలో స్వామిని ఒక్కో రోజు ఒక్కో విధంగా అలంకరిస్తారు. స్వామి వారిని పూజిస్తే అనుకున్న పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం. భారత్- పాక్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించడం... ఆ తర్వాత నావికాదళాధికారి ఇక్కడ మొక్కు తీర్చుకోవడం వంటివి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయి.
- వైభవంగా గణపతి నవరాత్రులు..