విశాఖ ఉత్తర నియోజకవర్గం లోని పబ్లిక్ హెల్త్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయంలో నాలుగు ఈవీఎంలు మెరాయించాయి.ఈ పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వచ్చిన భీమిలి నియోజకవర్గం తెదేపా అభ్యర్థి సబ్బం హరి పోలింగ్ బూత్ లో దాదాపు అరగంట పాటు వేచి ఉన్నారు. తన నియోజకవర్గానికి వెళ్ళవలసి ఉండటంతో నిరాశగా వెనుదిరిగారు.
తాను ముందుగా ఓటు వేసి తన నియోజకవర్గమైన భీమిలికి వెళ్లడానికి ఉదయాన్నే వచ్చానని... అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో అనివార్యంగా తిరిగి భీమిలి నియోజకవర్గానికి వెళ్తున్నానని సబ్బం హరి తెలిపారు.
ఈవీఎంల మొరాయింపు.. ఓటేయకుండా వెళ్లిపోయిన సబ్బం - vishka
విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయంలో 4 ఈవీఎంలు మెరాయించాయి. ఓటు వేయడానికి వెళ్లిన సబ్బం హరి భీమిలి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి అరగంట పాటు వేచి చూసి వెనుతిరిగారు.
ఓటు వేయకుండా వెనుతిరిగిన సబ్బం హరి
ఇదీ చదవండి.....