విశాఖ జిల్లా పెందుర్తి- సబ్బవరం మార్గంలో అధికారులు తనిఖీ చేస్తుండగా అటుగా అంబులెన్స్ వచ్చింది. అత్యవసర చికిత్స కోసం ఎవరైనా వెళ్తున్నారేమో అన్న అనుమానంతో ముందు ఆపేందుకు మాదక ద్రవ్యనిరోధక శాఖ సిబ్బందిఆలోచించారు. ఆ దారిలో గంజాయి తరలిపోతుందని పక్కా సమాచారం ఉంది.ఈ డైలమాలో ఉంటూనే అంబులెన్స్ ఆపారు. లోపల తనిఖీలు చేసిన అధికారులు ఆశ్చర్యపోయారు.
అంబులెన్స్‌లో గంజాయి
గంజాయి స్మగ్లర్లు అధికారుల కళ్లుగప్పి సరకు గమ్యస్థానాలకు చేర్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిఘా నుంచి తప్పించుకోడానికి అంబులెన్స్‌ల్లో తరలిస్తూ పట్టుబడ్డారు.
అంబులెన్స్ లోపల361 గంజాయి ప్యాకెట్లుఉన్మట్టు గుర్తించారు.ఒక్కో ప్యాకెట్లో ఐదు కిలోల చొప్పున మాదకద్రవ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు యత్నించారు. ఈ సరకు విలువ 2 కోట్ల 72 లక్షలు ఉంటుందని అధికారులులెక్కగట్టారు. వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు.
చెన్నై కోల్‌కతా రహదారి నిత్యం ఇలాంటి రవాణా జోరుగా సాగుతుందని ముందుస్తు సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ మార్గంలో నిఘా పెరిగిందని గ్రహించిన గంజాయి రవాణా ముఠా... అంబులెన్స్‌లను తమ అక్రమాలకు వినియోగించుకుంటున్నారు.