ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయొద్దు' - సీపీఐ

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమనీ.. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి దాన్ని అడ్డుకుంటామని అఖిలపక్ష నేతలు స్పష్టంచేశారు. దీనిపై చర్చించడానికి విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయొద్దు'

By

Published : Jul 24, 2019, 2:23 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని అఖిలపక్ష నేతలు స్పష్టంచేశారు. స్టీల్ ప్లాంట్​ని ప్రైవేటుపరం చేసే ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్వంలో విశాఖ సీపీఐ నగర కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దక్షిణ కొరియా కంపెనీ పోస్కో భాగస్వామ్యం ముసుగులో ప్రభుత్వం ప్రైవేటీకరణకు అంగీకరించవద్దని కోరారు. ప్లాంట్ పరిరక్షణకు ఎంతటి త్యాగానికైనా వెనుకాడమని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా ప్రతినిధి బొడ్డు పైడిరాజు, ఐఎన్టీయూసీ నాయకుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయొద్దు'

ABOUT THE AUTHOR

...view details