విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మూడోరోజు కొనసాగాయి. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ జైన్ దీక్షలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునే వరకు ఈ దీక్షలు కొనసాగిస్తామన్నారు ఐకాస నేతలు. భాజపా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్, కార్పొరేట్ రంగాలకు ఊతమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా కార్మిక వ్యతిరేక విధానాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు - Vishakha steel protests
విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోనళలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు