ఖచ్చితమైన సత్యాన్వేషణే..పరిశోధన అని ఆంధ్ర యూనివర్శిటీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామ్మోహన్ రావు అన్నారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం మానవ వనరుల కేంద్రంలో సామాజిక,సామాన్య శాస్త్రాల పరిశోధనా పద్ధతి పై పునశ్చరణ తరగతులను ఆయన ప్రారంభించారు.సత్యానికి,సాక్ష్యానికి మధ్య చాలా తేడా ఉంటుందని రామ్మోహన్ రావు అన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్రం అసోసియేట్ సంచాలకుడు ఎన్ ఏ డి.పాల్,కోర్సుల సమన్వయకర్తలు ఆచార్య సిద్దయ్య,డాక్టర్ యస్.హరనాథ్ పాల్గొన్నారు.
ఆంధ్రా యూనివర్శిటీలో శాస్త్రీయ తరగతులు - ఆంధ్రా
ఆంధ్ర విశ్వవిద్యాలయం యుజీసీ మానవ వనరుల కేంద్రంలో సామాజిక, సామాన్య శాస్త్రాల పరిశోధనా పద్ధతిపై పునశ్చరణ తరగతులను నిర్వహించారు.
ఆంధ్రా వర్శిటీలో శాస్త్రీయ తరగతులు